మాజీ ఎంపీకి యాదవ సంఘం సత్కారం
*పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానం
*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* మాజీ ఎంపీ ఎం. అంజన్‌కుమార్ యాదవ్‌కు చౌటుప్పల్ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మిర్యాలగూడలో నిర్వహించనున్న యాదవుల సదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్తున్న ఆయన చౌటుప్పల్ పట్టణానికి చేరుకోగా యాదవ సంఘం నాయకులు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలకల శ్రీనివాస్ యాదవ్, మండల యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్, అధ్యక్షుడు చినుకని మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు ఎర్రసాని సతీష్ యాదవ్, గజ్జి పాండు యాదవ్, సంఘం నాయకుడు వంటల రవి యాదవ్‌తో పాటు అధిక సంఖ్యలో యాదవ కులబాంధవులు పాల్గొన్నారు.