విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి
ఆమనగల్లు రంగారెడ్డి:
విద్యార్థులు విద్య తో పాటు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, వైస్ చైర్మన్ గీత లు సూచించారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల లో ఎంఈఓ పాండు అధ్యక్షతన నిర్వహించిన 70వ ఎస్ జి ఎస్ జోనల్ లెవెల్ అండర్ 14 వాలీబాల్ బాల బాలికల వాలీబాల్ టోర్నమెంటును వారు ప్రారంభించారు. టోర్నమెంటులో పది జోన్లకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల ఆనంతరం విజేతలైన బాలుర విభాగంలో ప్రథమ బహుమతిని రాజేంద్రనగర్ , ద్వితీయ బహుమతిని శంషాబాద్ పాఠశాల విద్యార్థులు, బాలికల విభాగంలో ప్రథమ బహుమతి కడ్తాల్, ద్వితీయ బహుమతి రాజేంద్రనగర్ విద్యార్థులు దక్కించుకున్నారు. అనంతరం వారు విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయిలలో నిర్వహించే పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, దేశ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జగన్, కృష్ణ, పాపిశెట్టి రాము, కోఆప్షన్స్ సభ్యుడు చుక్క అల్లాజిగౌడ్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, ట్రస్మా నాయకులు శివలింగం, సుధీర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నాయకులు సురేష్, శ్రీను నాయక్, పిడి లు, పి ఈ టి లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.