BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ భరోసా

Select Suryaa Now
ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ భరోసా

సూర్య, సెంటినరీకాలనీ ;ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ భరోసా ఇస్తుందని ఈఎస్ఐ అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ కుమార్, ఈపీఎఫ్‌కు చెందిన ఆకాశ్ తివారి, ఎస్ఎస్ఏ అభిలాష్ అన్నారు. మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ పథకాలపై శుక్రవారం కళాశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ కుమార్, ఈపీఎఫ్‌కు చెందిన ఆకాశ్ తివారి, ఎస్ఎస్ఏ అభిలాష్ పాల్గొని ఉద్యోగులకు పథకాల ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈఎస్ఐ, ఈపీఎఫ్ పథకాల ద్వారా ఉద్యోగులకు కలిగే ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను వివరించారు. పథకాలకు సంబంధించిన అర్హతలు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అందుబాటులో ఉన్న వివిధ స్కీముల గురించి కూలంకషంగా తెలియజేశారు. ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ పొందేందుకు అవసరమైన అర్హతలు, పెన్షన్ ఎవరికి వర్తిస్తుంది, ఎంత మొత్తం పొందవచ్చనే అంశాలను వివరించారు. ఉద్యోగులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వారు వాటిని నివృత్తి చేశారు. అనంతరం ఉద్యోగుల ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఖాతాలను అప్‌డేట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్ సిబ్బంది పాల్గొన్నారు.