BREAKING
సైబరాబాద్ డ్రంక్ & డ్రైవ్ లో 288 మందిపై కేసులు - ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్, జి నరేెందర్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని బెదిరింపు ఈమెయిల్, వదంతులను నమ్మవద్దు సీపీ మహెష్ మురళిదర్ భగవత్ చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా తేలప్రోలు రమేష్ కుమార్ ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘ప్రకృతి – వారసత్వం సమ్మేళనం’ ప్రత్యేక వాక్ నిర్వహించిన తెలంగాణ పర్యాటక శాఖ కాంగ్రెస్ లో పలువురు యువకుల చేరిక కంభంలో తోట మహాలక్ష్మి ప్రచార జోరు జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు డి.వి. రాజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానం పుట్టపర్తి మున్సిపల్ గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం ఏపీకి మూడు కొత్త రైల్వే లైన్లు.. 560 కి.మీ. మేర కొత్త ట్రాక్ ప్రతిపాదన! చిన్నారుల ఆరోగ్యం, వారి బంగారు భవిష్యత్తు కు  రెండే రెండు పోలియో చుక్కలు మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ

విద్యుత్ బకాయిల వివాదానికి ముగింపు: టీజీఈఆర్సీ కీలక నిర్ణయం

Select Suryaa Now
విద్యుత్ బకాయిల వివాదానికి ముగింపు: టీజీఈఆర్సీ కీలక నిర్ణయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న విద్యుత్ బకాయిల వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. 2014 తర్వాత తలెత్తిన ఈ ఆర్థిక వివాదానికి సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 28న ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను అధికారికంగా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ జెన్‌కో (APGENCO) తమకు రూ. 3,441 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయగా, ఇటు తెలంగాణ డిస్కంలు మాత్రం తమకు రావాల్సిన బకాయిలు రూ. 2,137 కోట్లు ఉన్నాయని వాదిస్తూ వచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ ఆర్థిక ప్రతిష్టంభనపై విచారణ జరిపిన TGERC, ప్రస్తుత పరిణామాలు మరియు న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ పిటిషన్‌ను ముగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ రంగానికి సంబంధించిన సుదీర్ఘ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.