తెలంగాణ తొలి వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ జువ్వాడిః అభినందించిన ఎంపీ చామల
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.