BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

తెలంగాణ బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్, ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు అందించాలి --- నీలం మధు.

Select Suryaa Now
తెలంగాణ బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్, ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు అందించాలి --- నీలం మధు.

హైదరాబాద్ /, ఆల్వాల్, మేజర్ న్యూస్ : రాష్ట్రం లో సింహ బాగాన ముదిరాజులు ఉన్నా,అన్ని రంగాల్లో అనగదొక్కబడుతున్నారు.అడవిలో ఫలావృక్షాలు పట్టుకొని పళ్ళు, అమ్ముకోవడం, చేపలు పట్టుకోవడం వంటివి కిల వృత్తిగా చేసుకొని కఠిక దరిద్రం లో జీవనం కొనసాగిస్తున్న  ముదిరాజులను సామాజిక ఉన్నంత స్థాయిలో అంటే కుల రిజర్వేషన్ లో వెనుకబడిన తరగతులు, 'డి 'చేర్చి ముదిరాజులకు తీరని అన్యాయం చేశాయి ప్రభుత్వాలు. విద్య పరంగా, రాజకీయం గా ఆర్ధికంగా పూర్తిగా వెనక్కు నెట్టివేయబడి ప్రభుత్వ ఫరంగా ఎలాంటి ఉపాది కి నోచుకోలేదన్నది జగమెరిగిన సత్యం.నిజాం రాజ్యం లో అధిపత్య అహంకారం తలకేక్కిన పెత్తందార్లు, భూస్వాములు  పేద బడుగు బలహీన వర్గాలపై అనేక దారుణాలకు పాల్పడుతున్న తరుణం లో ... మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో లో నావాబ్ పేట మండలం లో సాయమ్మ, అనంతయ్య ల పుత్రుడు పండుగ సాయన్న అప్పటికి యుక్తవయస్సులో ఉన్నాడు. క్రీడా పోటిల్లో నిస్నాతుడు. ఈ దౌర్జన్యాలను ఎదిరించేందుకు నిర్ణయించుకొని ఆకలితో అలమటిస్తున్న పెదకడుపుల కడుపు నింపేందుకు దొరల గడిల్లో నిలువయున్న దాన్యాన్ని దాడిచేసి తెచ్చి పేదలకు పంచాడు. తానే స్వయంగా ఆయుధాల్ని తయారు చేసి దళాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. పండుగ సాయన్నను అడ్డుకోవాలని అతనిని బంధీపోటుగా చిత్రికరించారు భూస్వాములు. నిజాం కు పిర్యాదు చేసి అతన్ని చంపేందుకు కుట్ర చేశారు. నిజాం రాజు, పెత్తందార్ల మాటలు నమ్మి, అరెస్ట్ చేయగా ప్రజలు విడిచి పెట్టాలని తిరుగుబాటు చేశారు. అయనను విడిపించాలని వనపర్తి రాణి పై ప్రజలు వత్తిడి తెచ్చారు., నిజాం ను కలసి వనపర్తి మహారాణి శంకరమ్మ పదివేల రూపీపాయల పూచ్చికత్తు తో విడిపించారు. ఆ క్రమం లో మారోమారు కుట్ర చేసి,నిజాం హుఖుమ్ లో వున్నా మారో మత్, చోడో అని వున్న దానిని   నిజాం అధికారులు, భూస్వాములు కలసి కుట్ర చేసి ఆ హుఖుమ్ ను మారో మత్ చోడో అని మార్చి మరణం శిక్ష వేయించి పాశివికం గా శిరచ్చేదాం చేసి చంపారు.నాటి నుండి నేటి వరకు పౌరుశానికి పెట్టింది పేరు ముదిరాజులు. సామాజికంగా మాత్రం వెనుక పడ్డ జాతి. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను  ముదిరాజులను బి. సి.'డి 'నుండి 'ఎ ' లకు మార్చి మా బతుకులు బాగుచేయ్యాందని కోరిన ఎన్నికల సమయం అధిక సంఖ్యలో ఉన్నా మా ఓట్లను వాడుకుంటూ మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాలు వెంటనే ముదిరాజుల న్యాయమైన డిమాండును నెరవేర్చాలి.
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, విప్లవ వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన రాస్ట్ర ముఖ్యమంత్రి రివంతరెడ్డి, రోడ్డు రవాణా శాఖమాత్యులు పొన్నం ప్రభాకర్, మంత్రివర్యులు వర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్, వీ. హెచ్. తదితర ముఖ్యలతో కలసి కార్యక్రమంలో పాల్గొని పండుగ సాయన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి 
ముదిరాజులను బీసీ-డీ నుంచి బీ సి-ఏ,లోకి,ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటుకు సీఎం సానుకూల స్పందన పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా పోరాట యోధుల చరిత్రకు గుర్తింపు ఇవ్వడం అభినందనీయం: ---నీలం మధు ముదిరాజ్.

తెలంగాణ ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆయన చరిత్రకు దక్కిన గొప్ప గౌరవమని ప్రజా పోరాట యోధుల జీవితాలను గుర్తించి, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ అభినందనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యవేక్షణలో అధికారికంగా నిర్వహించిన 174 వ పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం పట్ల నీలం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రజల హృదయాల్లో నిలిచిన పండుగ సాయన్నకు అధికారికంగా గుర్తింపు కల్పించిన ముఖ్యమంత్రికి నీలం మధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పండుగ సాయన్న వంటి ప్రజా పోరాట యోధుల చరిత్రను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, వారి జీవిత విశేషాలను యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. సమాజంలో అన్యాయాలను ఎదిరించి, పేదల పక్షాన నిలిచిన మహనీయుల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించవచ్చన్నారు.
తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్న ప్రజల కోసం పోరాడిన వీరుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని వివరించారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో పేదలు, బలహీన వర్గాలు ఎదుర్కొన్న దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం ప్రజల్లో విశేష ఆదరణ పొందిందన్నారు. ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న కథనాల ప్రకారం, సంపన్నుల నుంచి సంపదను తీసుకుని పేదలకు పంచేవాడిగా సాయన్న పేరు గావించారని అందుకే ఆయనను ప్రజలు ప్రేమతో తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పిలుచుకుంటారన్నారు.
పండుగ సాయన్న జీవితం సామాజిక న్యాయం, సమానత్వం, పేదల పట్ల బాధ్యత వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, బలహీనులకు అండగా నిలవడం, ప్రజల హక్కుల కోసం పోరాడడం వంటి అంశాలు సాయన్న చరిత్రలో కనిపిస్తాయని పేర్కొన్నారు. నేటి తరానికి ఆయన జీవిత విశేషాలను తెలియజేయడం ద్వారా సామాజిక బాధ్యత, సేవాభావం వంటి స్ఫూర్తిదాయకమైన విలువలను అందించవచ్చన్నారు.

పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ఈ దిశగా ఒక మంచి అడుగుగా అభివర్ణించారు.
ప్రజల కోసం పోరాడిన వీరుల జీవితాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని, పండుగ సాయన్న స్ఫూర్తి యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముదిరాజ్ సంఘం నాయకులు, ముదిరాజులు తదితరులు పాల్గొన్నారు..