శ్రీరాంనగర్‌లో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు, జబర్దస్త్’ ఫేం కొమురం నాగులు
మాదాపూర్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్ సీ బ్లాక్‌లో అభయాంజనేయ స్వామి దేవాలయం, కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు, జబర్దస్త్’ ఫేం కొమురం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సానె విజయ్ కుమార్ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు దసరా, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బట్టి బాలగౌడ్, జనరల్ సెక్రటరీ దిడ్డిగం రాజేందర్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ రవికిరణ్, ఆలయ జనరల్ సెక్రటరీ రంజిత్ సాగర్, కాలనీ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.