శ్రీ వైకుంఠపురంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, :రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీమన్నారాయణుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రీ వైకుంఠపురం క్షేత్రంలో మంత్రి స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది
.