BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

రూ.8 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి.. లేకుంటే యుద్ధమే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

Select Suryaa Now
రూ.8 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి.. లేకుంటే యుద్ధమే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు విద్యార్థి ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే విద్యార్థులతో కలిసి మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఫీజుల బకాయిల విడుదల కోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ వద్ద వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్, బీసీ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లగోర్ల మోడీరాందేవ్ యాదవ్ ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించగా, రాష్ట్ర బీసీ యువజన సంఘం కన్వీనర్ వంశీ, శివకృష్ణ ముదిరాజ్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీముపై ఉన్న వ్యతిరేకత మార్చుకోవాలన్నారు. ఈ స్కీముపై ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీలతో, మేధావులతో చర్చలు జరపాలి అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ మంత్రులతో, శాసనసభ్యులతో చర్చలు జరపాలని కోరారు. ఫీజుల బకాయిలు చెల్లిస్తే కాలేజి యాజమాన్యాలు తీసుకుంటారు. తప్ప విద్యార్ధులకు ఇవ్వరని ముఖ్యమంత్రి  చేస్తున్న వాదన సరికాదు. ఫీజులు మంజూరు చేసిన తరువాత ప్రభుత్వమే ప్రతి విద్యార్ధికి మెస్సేజ్ పెట్టాలి. లెటర్స్ ద్వారా ప్రకటనల ద్వారా తెలుపాలని సూచిస్తున్నాం. పైగా ఇంకా చాల మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించక పోవడంతో సర్టిఫికెట్లు కాలేజిలలోనే యున్నవి. కొందరు అప్పులు చేసి తీసుకున్న మంజూరు చేసిన తర్వాత మెస్సేజ్ చూసిన తర్వాత వచ్చి కాలేజీలలో వసూలు చేసుకుంటారు. కాలేజి యాజమాన్యాలే స్వాహా చేస్తారానే ఉహ జనితమైన ఆలోచన. ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్న వారు 20 – 30 శాతం యుంటారు. మిగతా 70  –  80 శాతం మంది సర్టిఫికెట్లు కాలేజీలలో యున్నవి. కావున బకాయిలు ఇవ్వక తప్పదని  హెచ్చరించారు.  ఇది కేవలం తప్పించుకోవడానికి చేసే ఎత్తు గడయన్నారు. నిజంగా చిత్తశుద్ది యుంటే ప్రభుత్వ అధికారులే కాలేజీలకు వచ్చి చెక్కులు పంపిణి చేయాలన్నారు. 16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజుల బకాయిలు 8,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపరెందుకు? ప్రజా సమస్యలపై నోరు మెదపకుండా ప్రాధాన్యత లేని అంశాలపై మాట్లాడి సమయం వృధా చేస్తున్నారు. కోర్సు పూర్తి చేసి 4,00,000 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలలో పెట్టుకున్నారు. బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. 90% మంది ఫీజు రీయింబర్సమెంట్ పథకం పై ఆధారపడి చదువుచున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారి సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నవి. వీరు డిగ్రీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులో చదివిన పాస్ అయిన సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు పొందలేక పై చదువులకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పరీక్షా సమయంలో హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఆర్దిక పరిస్థితి లేనివారు సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు లేక అవకాశం కోల్పోతున్నారు. దీనితో ఉన్నత చదువులు ఆపేస్తున్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజుల స్కీము బకాయిలు ఇవ్వకపోవడంపై ఏర్పడిన గందరగోళం వలన విద్యార్ధులకు ఉన్నత చదువులు చదువుతామనే నమ్మకం కోల్పోయింది. 30 వేల మంది విద్యార్ధులు కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు