రెండు ద్విచక్ర వాహనాలు డీ కొని ఇద్దరికీ గాయాలు
సూర్య కోరుట్ల టౌన్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ శివారులోని సబ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. TS02ED7074 నంబర్ గల హీరో ప్యాషన్, AP15BK4093 నంబర్ గల హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరు కిషన్‌రావుపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, మరొకరు మెట్‌పల్లికి చెందిన వ్యక్తిగా సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం కోరుట్ల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.