BREAKING
చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు ధనతేరస్, లక్ష్మీ పూజ వేళ రూ.62,000 కోట్లు దాటనున్న బంగారం విక్రయాలు యాలాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పాకిస్తాన్‌లో విచ్చలవిడిగా అక్రమ కిడ్నీల వ్యాపారం: అంతర్జాతీయ నివేదిక ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం సొంతింటిలో దీపావళి జరుపుకోవడం ఆనందదాయకం: కలెక్టర్ భవేష్ మిశ్రా పరిటాల ఘాటుకు నివాళులర్పించిన తూంచర్ల నూతన ఎంపీటీసీ పోతులయ్య!! నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సొంతింట్లో ఆనందంగా దీపావళి వేడుకలు : సర్పంచ్ చంద్ర భూపాల్ రావు

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిః చరణ్ కౌశిక్ యాదవ్

Select Suryaa Now
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిః చరణ్ కౌశిక్ యాదవ్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః రైతుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం వాస్తవాలను దాచిపెట్టి రైతులను అబద్ధాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా రైతులను రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుత సాగునీటి సమస్యకు ప్రభుత్వం కారణం కాదని, ఎల్‌నినో వాతావరణ ప్రభావం వల్లే నీటి లభ్యత తగ్గిందని చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించి అప్రమత్తం చేశామని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో 72 శాతం, గోదావరి బేసిన్‌లో 42 శాతం నీటి కొరత ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడిందని వివరించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను మోసం చేసిన చరిత్ర ఆ పార్టీకే ఉందని విమర్శించారు. ఇప్పుడు రైతుల సమస్యలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. అకాల వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం తడిసి పాడవకుండా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తూ అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదని, ప్రతి రైతుకు అండగా ఉంటూ ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.