BREAKING
చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు ధనతేరస్, లక్ష్మీ పూజ వేళ రూ.62,000 కోట్లు దాటనున్న బంగారం విక్రయాలు యాలాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పాకిస్తాన్‌లో విచ్చలవిడిగా అక్రమ కిడ్నీల వ్యాపారం: అంతర్జాతీయ నివేదిక ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం సొంతింటిలో దీపావళి జరుపుకోవడం ఆనందదాయకం: కలెక్టర్ భవేష్ మిశ్రా పరిటాల ఘాటుకు నివాళులర్పించిన తూంచర్ల నూతన ఎంపీటీసీ పోతులయ్య!! నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సొంతింట్లో ఆనందంగా దీపావళి వేడుకలు : సర్పంచ్ చంద్ర భూపాల్ రావు

రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయవద్దు -ఎన్ఎస్ యూఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సునీల్ గౌడ్

Select Suryaa Now
రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయవద్దు  -ఎన్ఎస్ యూఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సునీల్ గౌడ్

సూర్య - పెద్దపల్లి :
రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత జీవితాలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఎన్ఎస్ యూఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బండారి సునీల్ గౌడ్ పేర్కొన్నారు.శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ..కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్‌కు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్ చేసి,సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు చట్టప్రకారమే దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారని సునీల్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ నాయకుడు చిరుమల్ల రాకేష్ రాజకీయం చేయడం ఆక్షేపణీయమని అన్నారు.రాజకీయ ఉనికి కోసం ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలే తప్ప,వ్యక్తిగత అంశాలను వివాదాస్పదం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని,అనవసర వివాదాలకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని సునీల్ గౌడ్ సూచించారు.