BREAKING
మహేష్ బాబుపై అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్.. ఆయన ముందు నిలబడితే యాక్టింగే మర్చిపోతా! రంగయ్య చెరువు కాలువ పనులు పూర్తి చేయాలి-నేడు బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా పునరావస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల ప్రతి గ్రాడ్యుయేట్ ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం ఓటీటీలో భయపెడుతున్న కొత్త హారర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా వీక్షించండి! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు

ప్రజల జీవన ప్రమాణాలే లక్ష్యంగా సింగరేణి అభివృద్ధి పనులు

Select Suryaa Now
ప్రజల జీవన ప్రమాణాలే లక్ష్యంగా సింగరేణి అభివృద్ధి పనులు
సూర్య, మందమర్రి: పరిశ్రమల అభివృద్ధితో పాటు పరిసర గ్రామాల ప్రజల సంక్షేమానికి సింగరేణి సంస్థ ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించి ప్రజలకు మెరుగైన వసతులు అందించాలనే లక్ష్యంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా మందమర్రి ఏరియా పరిధిలోని కాసిపేట మండలంలో ఆర్‌పీ అండ్ ఎన్‌సీఆర్‌ఏపీ పథకం కింద రూ.63.50 లక్షలతో ఏర్పాటు చేసిన పలు సదుపాయాలను ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులను తగ్గించేందుకు కాశీపేట, ముత్యంపల్లి, అశోక్‌నగర్, చిన్న ధర్మారం గ్రామాల్లో రూ.30 లక్షలతో నాలుగు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రివేళ వెలుతురు, భద్రతకు తోడ్పడేలా రూ.10 లక్షలతో 41 సోలార్ వీధి దీపాలను అమర్చారు. రాకపోకలు సులభతరం చేసేందుకు రూ.16 లక్షలతో మూడు కల్వర్టులు, డ్రైనేజీ పనులు చేపట్టారు. యువత, విద్యార్థులు, గ్రామస్తుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో కాశీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.7.50 లక్షలతో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ నీటి వనరులను కాపాడుకోవడం, నీటిని పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. సింగరేణి సంస్థ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కల్పిస్తున్న సదుపాయాలను సొంత ఆస్తులుగా భావించి పరిరక్షించుకోవాలని కోరారు. బొగ్గు ఉత్పత్తితో పాటు పరిసర గ్రామాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. సింగరేణి అందించిన వసతులు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడతాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ నిర్వహణ, సంరక్షణలో సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న ధర్మారం సర్పంచ్ భూక్యా స్వప్న, ఉపసర్పంచ్ కిషన్, కార్యదర్శి ముభిన, ముత్యంపల్లి సర్పంచ్ చాకటి సుగుణ, ఉపసర్పంచ్ సందీప్, కార్యదర్శి ఎం.ఏ. తాజుద్దీన్, కాశీపేట సర్పంచ్ బడావత్ లీలా, ఉపసర్పంచ్ రమేష్, కార్యదర్శి ఎస్. శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమారి, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మాజీ ఎంపీపీ విక్రమ్ రావు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, కేకే గ్రూప్ ఏజెంట్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, డీజీఎం (సివిల్) ఎస్.కె. మదీనా భాష, డీజీఎం (పర్సనల్) సి.హెచ్. అశోక్, ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.