telangana
ప్రజావాణికి 11 దరఖాస్తులు
సూర్య, చింతలమానేపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 11 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో పి. సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన 8 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.