BREAKING
30వ వార్డులో మహబూబ్ బాషా వినూత్న ప్రచారం ఇంటింటా ప్రచారంతో ప్రజల్లోకి చంద్రకళ రమేష్ గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ:

ప్రైవేటు స్కూల్ బస్సులకు గుదిబండగా టోల్ గేట్

Select Suryaa Now
ప్రైవేటు స్కూల్ బస్సులకు గుదిబండగా టోల్ గేట్
 
 
సూర్య, హుజురాబాద్.
కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి 563 పై  కొత్త గట్టు వద్ద ఏర్పాటుచేసిన టోల్ గేట్ ప్రైవేట్ స్కూల్ బస్సు లకు గుదిబండ గా మారింది. హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులు శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గొల్లపల్లి గ్రామాల విద్యార్థుల కోసం ప్రతిరోజు వస్తాయి. దసరా సెలవులు అనంతరం శుక్రవారం ప్రవేట్ పాఠశాలల బస్సులు టోల్గేట్ వరకు రావడంతో  టోల్గేట్ వసూలు చేసే చార్జీలను చూసి పాఠశాల ల యజమానులు అవాక్కయ్యారు. ఒకరోజు పాఠశాల బస్సు కొత్తగట్టు కు వెళ్లి రావాలంటే వెయ్యి రూపాయలు టోల్ టాక్స్ పడుతుంది. నెలకు 17వేల రూపాయలు టికెట్ తీసుకుంటే అవుతుంది. దీంతో ప్రైవేట్ పాఠశాలల యజమానులకు ఇది  గుదిబండల మారిపోయింది. ఒక్క టోల్ గేట్ కి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతే పాఠశాలకు అదనకు భారంగా మారనుంది. ఇది పిల్లలపై పడే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పాఠశాలలో ఒక్క గ్రామం కోసం ప్రతి నెల 17వేల రూపాయలు భరించాల్సి వస్తుంది. దీంతో పాఠశాలల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రామానికి బస్సు పంపించకుంటే విద్యార్థులు నష్టపోతారు పంపితే పాఠశాల కు అదనపు ఖర్చు అవుతుంది దీనిని ఎవరు భరించాలి అన్న సమస్య వెంటాడుతుంది. 
***ఎన్ హెచ్ అధికారులకు ట్రస్మా వినతి 
 
కేవలం ఒక్క కొత్త గట్టు గ్రామానికి వెళ్లడానికి  నెలకు 17వేల రూపాయలు అదనపు భారం పాఠశాలల యజమానులపై పడుతుండడంతో శుక్రవారం హుజురాబాద్ ట్రస్మ నాయకులు హన్మకొండలోని జాతీయ రహదారి కార్యాలయంలో  అధికారులకు వినతి పత్రం అందజేశారు. టోల్ గేటు టాక్స్ నుండి ప్రైవేట్ పాఠశాలలకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో.  ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి, హుజురాబాద్ అధ్యక్షులు వకుళాభరణం వెంకటేశ్వర్లు, నాయకులు పారెడ్డి రవీందర్ రెడ్డి మాడిశెట్టి ప్రసాద్, దాసరి కోటేశ్వర్ యాదవ్, వేణుమాధవ్, గౌతంరెడ్డి, షాజు థామస్ తదితరులు పాల్గొన్నారు.