ప్రభుత్వ సలహాదారుని కృషితో ఆర్టీసీ బస్సు సౌకర్యం
సూర్య- బిక్కనూర్ : మండలంలోని తిప్పాపూర్ గ్రామస్తుల చిరకాల వాంఛ అయిన ఆర్టీసీ బస్సు సౌకర్యం 17 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కృషితో నెరవేరిందని, తిప్పాపూర్ గ్రామ ఉప సర్పంచ్ శామర్తి జీవన్ కుమార్ చెప్పాడు. శుక్రవారం గ్రామానికి నూతన ఆర్టీసీ బస్సు వచ్చిన సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గ్రామస్తుల కోసం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దసరా పండుగ రోజు ఆర్టీసీ బస్సును ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ బస్సును గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కుచినిపల్లి మహిపాల్, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు