telangana
పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం - ఎస్పీ అఖిల్ మహాజన్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించి దాదాపు 853 యూనిట్ల రక్తాన్ని ప్రజలు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేయబడిన ఈ మెగా రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని, రిబ్బన్ కట్ చేసి భారీ ఎత్తున ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు భారీ ఎత్తున పాల్గొని అమరవీరుల జ్ఞాపకార్థం వారు చేసిన సేవలను స్మరిస్తూ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ రక్తదాన శిబిరాలలో దాదాపు జిల్లా వ్యాప్తంగా 853 యూనిట్ల రక్తాన్ని పోలీసులు, ప్రజలు, ఔత్సాహికుల రక్తాన్ని రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా రక్తదానాన్ని చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలవడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అమరవీరుల సమస్మరణ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఒకప్పటి పోలీసులు చేసిన త్యాగాలను జిల్లా ప్రజలకు సవివరంగా వివరించి పోలీసులు చేసే విధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఒకప్పటి అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణ కి కారణమని గుర్తు చేశారు. ప్రజలు వారిని స్మరిస్తూ ఉండాలని, ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. వృత్తిరీత్యా పోలీసులు ప్రజల కోసం విధి నిర్వహణలు చేస్తుంటారని, వారిని ప్రజలు గౌరవించాలని, రాత్రనకా, పగలనకా, పండుగలు, కుటుంబ సభ్యులను విడిచి, ప్రజా ధన ప్రాణ మాన రక్షణలో 24 గంటలు పోలీసు యంత్రాంగం విధి నిర్వహణలో ఉంటారని తెలిపారు. జిల్లా అభివృద్ధి పథంలో వెళ్లడానికి సంఘవిద్రోహశక్తులు ఆటంకాలుగా మారుతారని, మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి సంఘవిద్రవశక్తులతో పోరాడుతూ జిల్లా పోలీసు వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తుందని గుర్తు చేశారు. రక్తదానం శిబిరం పెద్ద ఎత్తున ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఉత్సాహంగా పాల్గొని మహిళలు సైతం రక్తదానాన్ని చేసి పురుషులకు సమానంగా ఆదర్శంగా నిలిచారు. రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో అదనపు ఎస్పీలు పి మౌనిక ఐపీఎస్,బి సురేందర్ రావు, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, డాక్టర్లు, రిమ్స్ సిబ్బంది, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిమ్స్ సిబ్బంది, ఎన్జీవో నాయకులు, ప్రజలు, యువజన సంఘాలు, ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.