BREAKING
పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!* వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు *పిచ్చరాగడి తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ* అభివృద్ధిని చూసి...ఆదరించండి : ఎమ్మెల్యే కన్నా

పండుగ సాయన్న పేదల పాలిట పెన్నిధి

Select Suryaa Now
పండుగ సాయన్న పేదల పాలిట పెన్నిధి

మహబూబ్ నగర్ పియు సూర్య న్యూస్ -

పాలమూరు యూనివర్సిటీలో ఘనంగా జయంతి వేడుకలు.. చిత్రపటానికి అధికారుల నివాళులు

మహబూబ్‌నగర్‌, అక్టోబర్ 22: పాలమూరు యూనివర్సిటీలో బీసీ సెల్ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా *వీసీ మాట్లాడుతూ.. పండుగ సాయన్న పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజావీరుడని కొనియాడారు. పేదల ఆకలి బాధలను తన బాధలుగా భావించి, అన్యాయాన్ని ఎదిరిస్తూ అణగారిన వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ధనవంతుల అక్రమ సంపదను పేదలకు పంచి, నిరుపేదల జీవితాల్లో ఆశలు నింపిన ప్రజానాయకుడని అన్నారు. రైతుల శ్రమ దోపిడీకి గురికాకుండా పోరాడిన సాయన్న జీవితం త్యాగానికి, ధైర్యానికి ప్రతీక అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.*

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్ బాబు, ఓఎస్డీ ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి,చీఫ్ వార్డెన్ డా కృష్ణయ్య, జె డి డా విజయలక్ష్మి,ప్రిన్సిపాల్స్ డా భూమయ్య,డాక్టర్ ఈశ్వర్ కుమార్, ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ ఎస్.ఎన్. అర్జున్ కుమార్, అధ్యాపకులు తేజవర్ధన్,డాక్టర్ పి. రామరాజు,డా రవీందర్ గౌడ్ బోధనేతర సిబ్బంది సూపరింటెండెంట్ రవీందర్, సాయి కిరణ్, మనోహర్, రాము, జాహ్నవి, బోధనేతర అధ్యక్షులు రామ్మోహన్, విద్యార్థి సంఘం నాయకులు బత్తిన రాము,తయాప్ప, పండుగ ఆంజనేయులు, పండుగ సాయి తేజ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఓం ప్రకాష్ మహబూబ్ నగర్