పీఎం శ్రీ కబడ్డీ క్రీడలలో సత్తా చాటిన వల్లాల మోడల్ స్కూల్ విద్యార్థులు*
*రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎన్నికైన ఇద్దరు విద్యార్థులు*
*శాలిగౌరారం*
వల్లాల మోడల్ స్కూల్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు.నల్గొండ మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన పిఎం శ్రీ జిల్లా స్థాయి బాలుర కబడ్డీ క్రీడోత్సవాలలో మంచి ప్రతిభ కనబరిచి తెలంగాణ పీఎం శ్రీ వల్లాల మోడల్ స్కూల్ టీమ్ ప్రధమ బహుమతి సాధించిందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్ ఒక ప్రకటన లో తెలిపారు. పదవ తరగతి చదువుతున్న పర్వతం విజయ్,రాచకొండ యశ్వంత్ లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికయ్యారని ప్రిన్సిపల్ తెలిపారు.ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను,మోడల్ స్కూల్ పీడీ మల్లేష్ ను ఉపాధ్యాయ బృందం అభినందించింది.