BREAKING
భారత్-పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాల సమీక్ష..2027–2032 ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌పై దృష్టి రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. బిహార్‌లో రూ.34,470 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు పాలిటెక్నిక్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయానికి పోటెత్తిన భక్తులు పర్చూరు జడ్పిటిసి... జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న.. కలవకూరి పిచ్చమ్మ మండల టాపర్‌కు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత అక్రమ ఎగ్ డొనేషన్ కేసులో IVF కేంద్రాలపై హైకోర్టు ఆగ్రహం నవంబర్ 21న పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ప్రధాని మోదీ పర్యటన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పేద కుటుంబాలకు అండగా 'ఇందిరమ్మ జీవిత బీమా'- రంగపేటలో పథకాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయ వద్ద మహా యజ్ఞం ప్రజాస్వామ్యం,రాజ్యాంగం పట్ల తెదేపాకి అపారమై గౌరవం : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మతి భ్రమించింది : దౌర్జన్యాలు, అరాచకాలకు కేరాఫ్ పెద్దిరెడ్డి కుటుంబం : తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆర్.జె.వెంకటేష్ విమర్శలు ర్యాగట్లపల్లీ గ్రామంలో నూతన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ భక్తుల సౌకర్యార్థం మరో భోజనం కేంద్రం ఏర్పాటు

పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్లతో సాకారం – నగర మేయర్ దర్ని మధుకర్

Select Suryaa Now
పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్లతో సాకారం – నగర మేయర్ దర్ని మధుకర్
సూర్య నస్పూర్ : అర్హులైన నిరుపేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన గృహ వసతి కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ, నిరంతర కృషి, మార్గదర్శకత్వంతో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.