BREAKING
39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర

పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు

Select Suryaa Now
పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు

పటాన్‌చెరు;పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.శనివారం పటాన్‌చెరు, జేపీ కాలనీ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలలో రూ.2 కోట్ల 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ (యూజీడీ), వర్షపు నీటి కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తాగునీరు,విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలనీల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు.నూతన సీసీ రోడ్ల నిర్మాణంతో కాలనీల్లో రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో మురుగునీటి సమస్యకు, వర్షపు నీటి కాలువల నిర్మాణంతో వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ప్రజల సహకారంతో ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ చారి, ప్రకాష్ రావు, పృథ్వీరాజ్, వెంకటేష్,ఆశమ్,రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.