న్యాల్కల్ కేజీబీవీలో బాలల దినోత్సవం ఘనంగా
న్యాల్కల్; మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్పెషల్ ఆఫీసర్ లలిత ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.అనంతరం దినోత్సవ ప్రాముఖ్యతను ప్రిన్సిపల్ విద్యార్థినులకు వివరించారు. బాలికలు బెలూన్లతో సందడి చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు పంచుకున్నారు.