ముస్తాబవుతున్న 30 పడకల దవాఖానా.
వట్టిపల్లి;మండల కేంద్రంలో సుమారు 13 కోట్ల రూపాయల ఖర్చుతో వెలసిన 30 పడకల దవఖాన రెండు నెలల్లో, డిసెంబర్ లోపు అన్ని హాంగులతో పూర్తి అవుతుందని సైట్ ఇంజనీర్ సైదులు తెలిపినారు. పోయిన శివరాత్రి వరకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలలు కన్నారు. కానీ కొన్ని కారణాల చేత నిర్మించడం ఆలస్యం అయినది. 2027 శివరాత్రి వరకు ప్రజలకు అందుబాటులోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలలు నిజం కావాలని, వట్పల్లి మండలం ఇంకా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. సైట్ ఇంజనీర్ సైదులు మాట్లాడుతూ! ప్లంబర్, ఎలక్ట్రికల్ ,,ఫ్లోరింగ్, గ్లాస్ వర్క్ నడుస్తుంది అన్నారు .ఫైనల్ ఫిట్టింగ్ తొందరగా పూర్తి చేసి, ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు.