BREAKING
లండన్ అండర్‌గ్రౌండ్ రైల్వే సేవలకు అంతరాయం యెమెన్ లో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతతో పొట్టపోసుకుంటున్న నిరాశ్రయ తల్లులు పోలీస్ స్టేషన్ వద్ద కత్తితో దాడి.. కేసు నమోదు కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం స్పెయిన్ రైల్వే శాఖలో యూఈ అక్రమాల విచారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు 25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం అనుమతులు లేని టపాకాయల  దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు – భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

Select Suryaa Now
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు – భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

నారాయణపేట (కోస్గి), నవంబర్ 6, సూర్య న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ శుక్రవారం కోస్గి పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కోస్గిలోని సర్ సి.వి. రామన్ సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో ఆయన రాకపోకలకు సంబంధించిన రూట్ మ్యాప్, వాహనాల రాకపోకల మార్గాలు, పార్కింగ్ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు, రహదారులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రూఫ్‌టాప్ సెంట్రీలు, రోప్ పార్టీలు, కీలక కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణ మార్గాన్ని ముష్రిఫా బోర్డర్ వరకు స్వయంగా పరిశీలించి, మార్గమధ్యంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బందోబస్తు విధుల నిర్వహణలో ముందస్తు ప్రణాళికతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. భద్రతా లోపాలకు ఏమాత్రం అవకాశం లేకుండా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి, ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, ఏ. మహేష్, కోస్గి సీఐ సైదులు, ఆర్‌ఐ విజయ్ భాస్కర్, ఎస్సైలు చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి రెడ్డి, విజయ్ కుమార్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.