BREAKING
నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి ఎన్నికల అధికారులకు సీఈఓ విజయలక్ష్మి సూచనలు సంతలో పశువులను కొన్నట్టు అభ్యర్థులను కొనడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ వైసీపీని వీడి టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక వత్సవాయి మండలం వేమవరం గ్రామంలో టీడీపీలోకి భారీగా చేరికలు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా సీపీఐ షాట్ పుట్‌లో స్వర్ణం గెలుచుకున్న ఆయుష్ వర్మ మహిళా సాధికారతే దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకున్న పిఎసిఎస్ చైర్మన్ అనిత జితేందర్ రెడ్డి నేడే దేవరగట్టులో కర్రల ఉత్సవం... శిరిడి సాయిబాబాను దర్శించుకున్న రాష్ట్ర చైర్మన్ వరుసగా నాలుగో రోజు పడిపోయిన బంగారం ధరలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సైబర్ దాడి దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడుతున్నాం రిపబ్లికన్లు అన్ని అంచనాలను తలకిందులు చేస్తారన్న డొనాల్డ్ ట్రంప్

మందమర్రిలో వైభవంగా రామ్‌లీలా ఉత్సవాలు

Select Suryaa Now
మందమర్రిలో వైభవంగా రామ్‌లీలా ఉత్సవాలు

• చెడుపై మంచి విజయానికి ప్రతీకగా రాక్షస సంహారం

• హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్

సూర్య, మందమర్రి : చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలను మందమర్రిలో ఘనంగా నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో మంగళవారం మందమర్రి సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన రామ్‌లీలా, రాక్షస సంహార కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయబద్ధంగా సాగిన రాక్షస సంహార ఘట్టంతో పండుగ ప్రాంగణం సందడిగా మారింది. ఈ వేడుకలకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇన్‌చార్జి న్యాయమూర్తి నిరోష, సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు హాజరయ్యారు. రామ్‌లీలా ప్రదర్శనతో పాటు రాక్షస సంహార ఘట్టం విజయదశమి పండుగ వైభవాన్ని చాటిచెప్పింది. ధర్మం, సత్యం, న్యాయం ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాయనే సందేశాన్ని ఈ వేడుకలు ప్రజలకు అందించాయి. చెడును విడనాడి సన్మార్గంలో నడవాలని, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయదశమి పండుగ ప్రబోధిస్తుందని ఉత్సవాల సందర్భంగా చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, సింగరేణి అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.