వైసీపీని వీడి టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక వత్సవాయి మండలం వేమవరం గ్రామంలో టీడీపీలోకి భారీగా చేరికలు
వత్సవాయి: వేమవరం గ్రామంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో సుమారు 20 కుటుంబాలకు చెందిన వారు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), మండల టీడీపీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు కల్పిస్తామని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.మండల పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు మాట్లాడుతూ, కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకొని వేమవరం గ్రామంలో టీడీపీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.టీడీపీలో చేరిన వారిలో పూర్ణకంటి చిన్న ఇసాక్, మాదాల శ్రీశైలం, మాదాల రమేష్, తాటికొండ శ్రీనివాసరావు, శ్రీరామ్ రామయ్య, కందుల యేసురత్నం, రుంజ రమేష్, రుంజ బాబు, పూర్ణకంటి వెంకటేష్, గోనుగుంట్ల సత్యం, బలవంతపు ఆనందరావు (బాల), బలవంతపు రామారావు, బలవంతపు శ్రీనివాసరావు, నామతోటి రాయప్ప, బర్ల ప్రేమ్ కుమార్, పిల్లి బాబు, గోనుగుంట్ల కుటుంబరావు, రుంజ జయరాజ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.