BREAKING
సాక్ష్యాలపై తీవ్ర సందేహాలు: మరణశిక్ష ఖైదీకి క్షమాభిక్ష పెట్టిన అలబామా గవర్నర్ కే ఐవీ! లింకన్ జయంతి కానుకగా పుట్టి ‘బ్లాక్ నేషనల్ ఆంథమ్’గా ఖ్యాతి: ‘లిఫ్ట్ ఎవ్రీ వాయిస్ అండ్ సింగ్’ చారిత్రక ప్రస్థానం! దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం.. తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు! కార్నెల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ స్పందనపై బాధితురాలి ఆవేదన: మద్దతు ఇవ్వాల్సింది పోయి ఒంటరిని చేశారు! యూరప్ మార్కెట్లపై గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి ఫ్రెంచ్ విప్లవం నుంచి నేటి వరకు: నిరసనల గడ్డ ఫ్రాన్స్.. పాలక వర్గాల వెన్నులో వణుకు పుట్టించే ఉద్యమ సంస్కృతి! యూరో లిక్విడిటీ లైన్ల ఆవశ్యకతపై చైనాతో చర్చలు కరుగుతున్న స్విస్ హిమానీనదాలు.. వెలుగుచూస్తున్న చారిత్రక అవశేషాలు: లూసర్న్‌లో ‘ట్రెజరీ ఆఫ్ ఐస్’ ప్రదర్శన! నిప్పుల కొలిమిలా ఫ్యాక్టరీలు.. నరకం చూస్తున్న పాకిస్థాన్ కార్మికులు: గ్లోబల్ బ్రాండ్ల భద్రతా హామీలు గాల్లోకి! ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంపై రష్యా డ్రోన్ల బీభత్సం బ్రెజిల్ ఎన్నికల కోర్టుకు మెటా స్పష్టత: లూలా, బోల్సోనారోలకు సమాన ప్రాధాన్యత.. నిబంధనల ఉల్లంఘన లేదని వెల్లడి! అట్లాంటాలోని ఐస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి మిలన్ అల్లర్ల తర్వాత ఇటలీ ప్రధాని మెలోని కఠిన నిర్ణయం: నిరసనకారులపై ఉక్కుపాదం మోపేలా నూతన భద్రతా చట్టాలు! బంగ్లాదేశ్ పౌరుల మరణశిక్ష...సౌదీ అరేబియా నుంచి స్పందన రాలేదన్న డాకా దసరా వేడుకల్లో ఘర్షణలు...జనగామలో ఉద్రిక్తత..

శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్

Select Suryaa Now
శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్

పెద్దపంజాణి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ విధిస్తున్నట్లు మరియు పోలీసులు భారీ మార్చ్ పాస్ట్  నిర్వహించినట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. మండలంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మండల వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు పెద్దపంజాణి సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బాబు  తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.ఎన్నికల వేళ ఓటర్లలో ధైర్యాన్ని నింపేందుకు మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదనే హెచ్చరికను పంపేందుకు పోలీస్ సిబ్బందితో కలిసి మండల కేంద్రంలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ప్రధాన వీది గుండా సాగిన ఈ మార్చ్ పాస్ట్‌లో పోలీసులు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుంపులుగా చేరడాన్ని పూర్తిగా నిషేధించారు.నిబంధనలను ఉల్లంఘించి ధర్నాలు, ర్యాలీలు లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.ఎన్నికలు ముగిసే వరకు ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ, ప్రశాంత వాతావరణానికి సహకరించాలని పెద్దపంజాణి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.