జనాలు ఫుల్ బస్సులు నిల్
పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని కల్లూరు సదుం సోమల చౌడేపల్లి నుండి పుంగనూరు వైపు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బుధవారం ఉదయం 8 గంటల నుండి రాకపోవడంతో బస్ స్టాప్ లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇదే విషయమే పుంగనూరు ఏపీఎస్ఆర్టీసీ అధికారులను ఫోన్ లో సంప్రదించగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పుంగనూరు నుండి కల్లూరు , కల్లూరు నుండి పుంగనూరు వైపు బస్సులు తిరుగవని తెలిపారు.
రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా