నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి ఎన్నికల అధికారులకు సీఈఓ విజయలక్ష్మి సూచనలు
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోని సీఈఓ ఛాంబర్‌లో ఎన్నికల అధికారులతో సీఈఓ విజయలక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.ఈ సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థులకు అవసరమైన సహకారం అందిస్తూ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో గోవిందరాజులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.