BREAKING
కాప్31 సదస్సు వేదికగా క్లీన్‌టెక్ టారిఫ్‌లపై పోరుకు చైనా సన్నాహాలు చమురు, గ్యాస్ ధరల జోరుతో రెట్టింపైన లాభాలు వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు – కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు చీర్యాల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో వైభవంగా శమీ పూజ.. భారీగా తరలివచ్చిన భక్తులు పాలసీ సమన్వయాన్ని పెంచుకోవడానికి ఏపెక్ ఆర్థిక మంత్రుల అంగీకారం బుక్కపట్నంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం పటిష్ట పోలీస్ బందోబస్తు.. సమర్థవంతమైన ఏర్పాట్లు మాంగోళ్లుదేశుపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా పురుషోత్తం నామినేషన్ దసరా వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో నాగారం నాయకుల భేటీ అత్యుత్తమ ప్రణాళికలు అమలు చేసినప్పటికీ మరింత పెరుగనున్న గ్లోబల్ వార్మింగ్ పటిష్ట బందోబస్తు మధ్య మొదలైన నామినేషన్ ప్రక్రియ. క్రికెట్ విజేత లగన్స్ జట్టు మూడో త్రైమాసికంలో అంచనాలను తలకిందులు చేసిన అక్జో నోబెల్ సింగపూర్‌కు విస్తరిస్తున్న చైనా ఏఐ దిగ్గజం అంచనాలను మించి రెవెన్యూ సాధించిన ర్యాండ్‌స్టాడ్ అంచనాలను తలకిందులు చేసిన ఎడెన్‌రెడ్

పులివెందులలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై ఆగని దాడులు వాహనాల దహన సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి

Select Suryaa Now
పులివెందులలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై ఆగని దాడులు  వాహనాల దహన సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి

పులివెందుల మేజర్ న్యూస్‌:
పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కౌన్సిలర్‌ అభ్యర్థులపై దాడులు ఆగడం లేదని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. పులివెందులలో కౌన్సిలర్‌ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం జరిగిన ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజులుగా టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడం, కాల్పుల ఘటనలకు పాల్పడటం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడంతోపాటు, కొందరిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.

పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా