క్రికెట్ విజేత లగన్స్ జట్టు
ఆత్మకూర్ /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబాను బుధవారం ఉదయం రాష్ట్ర బాలల హక్కుల చైర్ పర్సన్ కె సీతా దయాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులకు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శిరిడి సాయిబాబా దేవాలయ నిర్మాణ ప్రధాన కర్త ఆమె భర్త మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు కొత్తకోట దయాకర్ రెడ్డి నిర్మించారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆమె అభిమానుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతా దయాకర్ యువసేన సభ్యులు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.