వెల్దుర్తి మండల ప్రజాపరిషత్‌లో 'ఫారమ్-2' ప్రదర్శన
వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ స్థానిక మండల ప్రజాపరిషత్ (ఎమ్‌పిపి) కార్యాలయ ఆవరణలో ఫారమ్-2 (Form-II) నోటీసును అధికారులు బుధవారం ప్రజల సమాచారం నిమిత్తం ప్రదర్శించారు. ప్రభుత్వం మరియు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులు, సంబంధిత వివరాలను నోటీసు బోర్డు ద్వారా తెలియజేసినట్లు మండల అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ... ప్రదర్శించిన జాబితాపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు లేదా విజ్ఞప్తులు ఉంటే నిర్ణీత గడువులోగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ నోటీసును పరిశీలించి తగిన సూచనలు అందించవచ్చని తెలిపారు సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం