మడకశిర జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థిగా శారదమ్మ ఖరారు ఆవుల శ్రీనివాసులు నామినేషన్ తిరస్కరణతో అభ్యర్థి మార్పు.. శారదమ్మకు బీ-ఫామ్ అందజేత
మడకశిర (మడకశిర, మేజర్ న్యూస్) : మడకశిర మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా జనసేన పార్టీ శారదమ్మను ఖరారు చేసింది. తొలుత జనసేన అభ్యర్థిగా ఉన్న ఆవుల శ్రీనివాసులు నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయ అభ్యర్థిగా శారదమ్మను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇటీవల తిప్పేస్వామి కుటుంబానికి చెందిన శారదమ్మ జనసేన పార్టీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు చైర్‌పర్సన్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేన నాయకులు శారదమ్మకు పార్టీ బీ-ఫామ్‌ను అందజేశారు.
నామినేషన్ తిరస్కరణతో అభ్యర్థిని మార్చాల్సి రావడం మడకశిర మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు కీలక పరిణామంగా మారింది. కొత్త అభ్యర్థిగా శారదమ్మ బరిలోకి దిగడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.