ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలి
- శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ లక్ష్మయ్య.
- కొందుర్గ్ లో ఘనంగా స్వామి వారి పల్లకి సేవ, శోభాయాత్ర.
కొందుర్గ్ (రంగారెడ్డి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కమిటీ ఛైర్మెన్ కావలి లక్ష్మయ్య కోరారు. విజయ దశమి పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. విజయ దశమి సందర్భంగా దేవాలయం ఆవరణలో అమ్మ వారిని ఏర్పాటు చేసి, నవరాత్రులను భక్తి,శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సాయంత్రం దేవాలయం నుంచి మండల కేంద్రం శివారులో పెండ్యాల లోని గుట్ట పై ఉన్న పాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు ఊరేగింపు గా తీసుకు వెళ్ళారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం జమ్మి పూజ నిర్వహించారు. జమ్మి పూజ అనంతరం భక్తులు ఒకరికొకరి జమ్మి ఆకును ఇచ్చుకుంటూ, పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి దేవాలయం వరకు ఊరేగింపు గా స్వామి వారిని తీసుకు వచ్చారు. శోభాయాత్ర లో భక్తులు భజన పాటలు పాడుతూ, భక్తి పారవశ్యం లో మునిగిపోయారు. తిరుగు ప్రయాణంలో స్వామి వారికి మండల కేంద్ర వాసులు మొక్కలు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు జి నరేందర్ గౌడ్, ఎస్ యాదగిరి, ఎల్ సంజీవ రెడ్డి, అమరలింగం,వెంకటేష్, రేణుక, మండల కేంద్రం సర్పంచ్ చౌడపురం ప్రభాకర్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు కావలి యాదయ్య, కె రాములు గౌడ్, కాడిగళ్ళ మహేందర్, కె నర్సింలు గౌడ్, కె లక్ష్మయ్య గౌడ్ , బొరిగే నరేందర్, బొరిగే యాదయ్య, కె పద్మయ్య, జే ప్రసాద్, సి లింగం, కే వెంకటేష్, సి లక్ష్మయ్య, టి మాధవ రెడ్డి, పాపి రెడ్డి, కె వెంకయ్య, మల్లేష్, టి ప్రభు, కే చంద్రశేఖర్, ఎం వేణుగోపాల్ గౌడ్, ఎండీ వహీద్, కోరుకొండ యాదగిరి,రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ , మేజర్ న్యూస్.