తండ్రి మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన నీలం ప్రశాంత్ కుమార్-ఆటోడ్రైవర్ ఉప్పలయ్య మృతిపై దిగ్భ్రాంతి-కుటుంబ సభ్యులకు పరామర్శ పదివేల ఆర్థిక సహాయం
లింగాలఘణపూర్ , మేజర్ న్యూస్, మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ చౌడబోయిన ఉప్పలయ్య ఆకస్మిక మృతితో విషాదంలో మునిగిపోయిన ఆయన కుటుంబానికి అరుణాచలేశ్వర గ్రూప్స్ అండ్ మీడియా చైర్మన్ నీలం ప్రశాంత్ కుమార్ అండగా నిలిచారు. ఉప్పలయ్య మరణవార్త తెలుసుకున్న ఆయన, తన స్వగ్రామమైన లింగాల ఘణపురానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.మృతుడు ఉప్పలయ్య తన తండ్రికి ఆప్తమిత్రుడు కావడంతో, ఆయన మరణం పట్ల ప్రశాంత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముందుగా ఉప్పలయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఉప్పలయ్యతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉప్పలయ్య కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 10,000 నగదును అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఆపద సమయంలో స్పందించి ఉదారత చాటుకున్న నీలం ప్రశాంత్ కుమార్‌కు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్; కార్తీక్ ,లింగాల గణపురం, జనగామ జిల్లా