BREAKING
చిలకలూరిపేటలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట బందోబస్తు నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: సీఐ రమేష్,ఎస్సై అనిల్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోటంరెడ్డి కుటుంబం దూకుడు ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా వత్సవాయి జడ్పీటీసీ అభ్యర్థిగా కిలారు విశ్వనాథ్ నామినేషన్.. టీడీపీలో గందరగోళం! జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చక్రం తిప్పిన వేమిరెడ్డి కుటుంబం.. పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి:..ప్రత్యేక అధికారి హనుమంత రావు. అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. రాయితీపై విత్తనాలు.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలి.. అక్టోబర్ 24న ఎన్నికల శిక్షణ – స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఒకే రోజు నిర్వహించడంపై ఉపాధ్యాయుల్లో గందరగోళం.. నల్లపల్లి విజయ్ భాస్కర్ కరీంనగర్ ఏఎంసీ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం ఇథనాల్ తయారీకి చక్కెరను మళ్లించవద్దు: రాష్ట్రాలకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు.. దేశీయ లభ్యత, ధరల నియంత్రణే లక్ష్యం! ట్రంప్-మోదీ 'గ్రాండ్' ట్రేడ్ డీల్: భారత్ ఎక్కువ రాయితీలు ఇస్తోందా? భారత ప్రయోజనాలు, వాణిజ్య సవాళ్ల సమగ్ర విశ్లేషణ! ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ ఎల్ ని నో ప్రభావం... యాసంగిలో ఆరుతడి పంటలే శ్రేయస్కరం... ఇంకెన్నాళ్లీ పారిశ్రామిక ప్రమాదాలు? కార్మికుల ప్రాణాలకు భద్రతేది?

ఎమ్మెల్యే చేతులు మీదుగా పెట్రోల్ బంక్ ప్రారంభం

Select Suryaa Now
ఎమ్మెల్యే చేతులు మీదుగా పెట్రోల్ బంక్ ప్రారంభం

గోకవరం, మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వీరలంకపల్లి సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రిహీత పెట్రో ఫ్యూయల్స్ హెచ్ పి పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, తొలి ఇంధనాన్ని కొనుగోలు చేశారు.

 ఈ పెట్రోల్ బంక్ నిర్వాహకులు సిద్ధా నాగేశ్వరరావు, సిద్ధా రామ్ పవన్ కుమార్ గత నలభై సంవత్సరాలుగా ఇంధన వ్యాపార రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి, నాణ్యత, పరిమాణం విషయంలో నూటికి నూరు శాతం ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారుల విశేష నమ్మకాన్ని చూరగొని అఖండ విజయాన్ని సాధిస్తున్నారు. గోకవరం పరిసర ప్రాంత వాహనదారులకు స్వచ్ఛమైన ఇంధనం, అత్యుత్తమ సేవలు, పరిపూర్ణ కొలతలతో కూడిన సేవలందించడమే ధ్యేయంగా ఈ గ్రిహిత పెట్రో ఫ్యూయల్స్ బంకును అత్యాధునిక సౌకర్యాలతో, సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. 

ఈ సందర్భంగా బంకు యజమాని రామ్ పవన్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో పాటు అభిమాన నేతలు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ మా బంకు ప్రారంభోత్సవ పాల్గొనడం మాకెంతో సంతోషదాయకమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడపా భరత్, ఉంగరాల రాము, కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, దాసరి తమన్న దొర, మారిశెట్టి భద్రం, పాలూరి బోసు బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, గ్రామ పెద్దలు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.