BREAKING
బంగారం, వెండి ధరల్లో భారీ బ్రేక్.. పసిడి ప్రియులకు ఊరట! ప్రముఖ మీడియా దిగ్గజం కామ్‌కాస్ట్ సంచలన నిర్ణయం ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసించిన టాప్ 11 సినిమాలు అమెరికా వాతావరణ ఉద్యమ నేత గీనా మెక్‌కార్తీకి అరుదైన గౌరవం టెక్ రిసోర్సెస్ సంస్థకు కార్మిక సెగ ఇరాన్‌తో చర్చలు జరపడం లేదు: పరిస్థితి త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! స్వీడన్ ప్రముఖ బ్యాంక్ స్వెడ్‌బ్యాంక్ మూడో త్రైమాసిక ఫలితాలు ఫార్మా దిగ్గజం రోచ్ సంచలనం టెలికామ్ దిగ్గజం టెలియా సంచలన నిర్ణయం ఎన్నికల కోడ్ అమలుపై అధికారులకు శిక్షణ - ఎంసీసీ నోడల్ అధికారి దుండి రాంబాబు సమీక్ష 31వ డివిజన్ లో ఘంటా మౌళిక ప్రచార హోరు... ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు సహకరించాలి – డీఎస్పీ బి. విద్య పేరియర్ విజ్ఞాన యాత్రలో పాల్గొన్న నాయకులు పాల్గొన్న నాయకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోరు ఎమ్మెల్యే చేతులు మీదుగా పెట్రోల్ బంక్ ప్రారంభం

మెట్లకుంటలో ఘనంగా పండగల సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు

Select Suryaa Now
మెట్లకుంటలో ఘనంగా పండగల సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు

బొంరాస్‌పేట, మేజర్ న్యూస్: తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పండగల సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను గురువారం బొంరాస్‌పేట మండల పరిధిలోని మెట్లకుంట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, ప్రజల కోసం చేసిన సేవలు, సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన పండగల సాయన్న ముదిరాజ్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి సామాన్య ప్రజలకు అండగా నిలిచిన ఆయన చరిత్ర తెలంగాణ సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని కొనియాడారు. పండగల సాయన్న ముదిరాజ్ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఇది ముదిరాజ్ సమాజంతో పాటు బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు.సాయన్న ముదిరాజ్ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు అన్నారు. బీసీ వర్గాల ఐక్యత, సామాజిక చైతన్యం, సమానత్వ సాధన కోసం అందరూ సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల చరిత్రను యువత తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమాదేవి నర్సింలు నాయుడు, బాబయ్య నాయుడు, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు షావుకారి చిన్న సత్తయ్య, పలేపల్లి అనంతయ్య, కావాలి అంజిలయ్య, కావాలి కృష్ణ, పిడుగు సత్తయ్య, వుంటువాలి కృష్ణ, కె. సత్తయ్య, మేడిపల్లి సత్తయ్య, పిట్ల వెంకటయ్య, వి. మల్లయ్యతో పాటు ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.