BREAKING
మర్రిపూడిలో యువతరంగం.. బరిలో బీటెక్ యువతి! సబితమ్మకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్న 11వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను మేయర్‌గా గెలిపించండి: టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికిస్తున్న PHP భద్రతా లోపాలు: గ్లోబల్ అలర్ట్ జారీ చేసిన ప్రపంచ దేశాలు.. సౌదీ ఆయిల్ క్షేత్రాలపై హౌతీల దాడులు: భగ్గుమన్న ముడి చమురు.. బ్యారెల్‌పై డాలర్‌కు పైగా పెరిగిన ధరలు! వెస్ట్ బ్యాంక్ ఆలివ్ కోతలపై ఇజ్రాయెల్ బలగాలు, సెటిలర్ల ఆంక్షలు: రైతులకు తీవ్ర అడ్డంకులు.. పంటను అడ్డుకుంటున్న వైనం! బ్రెజిల్ ఎన్నికల పోరులో వ్యక్తిగత రికార్డుల సవాల్: సౌదీ అరేబియా కింగ్ ఫహద్ విమానాశ్రయంపై దాడి: ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు.. విమానాల దారిమళ్లింపు! కొరియా సరిహద్దుల్లో మళ్లీ లౌడ్‌స్పీకర్ల యుద్ధం: ప్రచార ప్రసారాలు పునఃప్రారంభిస్తామన్న ఉత్తర కొరియా.. చర్చలకు పిలుపునిచ్చిన సియోల్! భారతీయ బ్యాంకింగ్ రంగంపై క్యాపిటల్ వైఫల్యం విషాదం కంటే ప్రహసనమే టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో రాజకీయ సంచలనం: డెమొక్రాట్ అభ్యర్థి జేమ్స్ తలారికోకు జార్జ్ డబ్ల్యూ బుష్ సోదరుడి మద్దతు! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ ‘టైఫూన్’ యుద్ధ విమానాలు: ఏ .నారాయణపురం ఎంపీటీసీ 6 స్థానానికి టిడిపి అభ్యర్థి కే. రామాంజనేయులు నామినేషన్ గుంటూరు: మేయర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే నజీర్ ప్రచారం

మంచిర్యాలలో శాంతిభద్రతలను కాపాడాలి: బీజేపీ అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు

Select Suryaa Now
మంచిర్యాలలో శాంతిభద్రతలను కాపాడాలి: బీజేపీ అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు

సూర్య మంచిర్యాల టౌన్ : మంచిర్యాల నియోజకవర్గంలో గ్యాంగ్ వార్లు,బహిరంగ దాడులు, యువతలో మత్తుపదార్థాల వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, ప్రజలకు భద్రత కల్పించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు డిమాండ్ చేశారు.ఈ పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.స్థానికంగా జరుగుతున్న ఆధిపత్య పోరాటాల్లో యువతను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు.మత్తుపదార్థాల సరఫరా, అక్రమ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై రాజకీయ సంబంధాలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంచిర్యాలలో తరచూ చోటుచేసుకుంటున్న గొడవలు, దాడులపై ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించాలని,విధుల్లో నిర్లక్ష్యం లేదా అవినీతికి సంబంధించిన ఆధారాలు లభిస్తే విచారణ జరిపించాలని కోరారు.అవసరాన్ని బట్టి పోలీసు అధికారుల బదిలీలను పరిశీలించి, సమర్థత, నిజాయితీ, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.