నేడే దేవరగట్టులో కర్రల ఉత్సవం...
నేడే దేవరగట్టులో కర్రల ఉత్సవం...
అర్థరాత్రి మాళమల్లేశ్వర స్వామికి కళ్యాణోత్సవం... చైత్రయాత్ర
హొళగుంద,సూర్య ప్రతినిధి:.కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి వార్లకు దేవాలయంలో నేడు బుధవారం అర్ధరాత్రి కళ్యాణోత్సవం.. జైత్రయాత్ర కార్యక్రమం భాగంగా కర్రలు ఉత్సవం ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ఉత్సవాలకు ఇప్పటికే అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత, సిసి, డ్రోన్ కెమెరాల నిఘాలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఉత్సవాలను భక్తి భావంతో సాంప్రదాయ బాద్దంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వారు భక్తులకు తెలియజేశారు. కర్రలు ఉత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక,తమిళనాడు ప్రాంతాల నుండి లక్షల్లో భక్తులు హాజరుకానున్నారు. గురువారం తెల్లవారుజామున పూజారి గిరి మల్లయ్య స్వామి ఎదురు బసవన్న గుడిపై ఎక్కి భవిష్యత్తులో జరిగే భవిష్యవాణిని చెప్పనున్నారు.
టీచర్ ఉమాపతి సూర్య ప్రతినిధి హొళగుంద కర్నూలు జిల్లా