మాజీ మంత్రి మల్లారెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మల్లారెడ్డి
మేడ్చల్, మేజర్ న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీమంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల ప్రభావం ప్రజలపై పడకుండా అమ్మవారు కాపాడాలని ప్రార్థించారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని, విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి, దయానంద్ యాదవ్, శంభు ప్రభాకర్, రఘుపతి రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.