మెగా రైతు మేళాకు 11 బస్సులు .. ఏవో నిశాంత్ కుమార్
ఫరూక్ నగర్, రంగారెడ్డి
వికారాబాద్ జిల్లా హకీంపేట్ లో జరుగుతున్న మెగా రైతు మేళా - 2026 కు మండలం నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్ కుమార్ కోరారు.. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రైతులను మెగా రైతు మహిళా సభకు తరలి వెళ్లేందుకు 11 బస్సులను ఏర్పాటు చేసినట్లు నిశాంత్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరుగుతున్న ఈ మేళాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన యంత్రాలు, సాంకేతిక సదస్సులపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
మండల రైతుల పర్యటన సోమవారం (09-11-2026) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది అని మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నరసింహ రెడ్డి మేజర్ న్యూస్…