మర్పల్లి ప్రజావాణికి 18 దరఖాస్తులు
మర్పల్లి,మేజర్ న్యూస్:మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 18 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో శాంత తెలిపారు. వీటిలో ఒకటి సంబంధిత సమస్యపై, మరొకటి బీసీ హాస్టల్‌కు సంబంధించిన సమస్యపై దరఖాస్తులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీవో శాంత, ఏపీవో అంజిరెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.