BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా

Select Suryaa Now
మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే  డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా

 


మునగాల, మేజర్ న్యూస్ : మద్యం సేవించి వాహనం నడిపిన 8 మందికి కోర్టు జరిమానా విధించగా, ఇద్దరికి జైలు శిక్ష కూడా విధించినట్లు ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపారు.ఈ నెల 27న మునగాల మండలం తాడువాయి స్టేజి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 8 మంది వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.వారిని అదుపులోకి తీసుకుని బుధవారం కోదాడ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.2 వేల జరిమానాతో పాటు ఒకరోజు జైలు శిక్ష, మిగతా ఆరుగురికి రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ ఎం.డి. ఉమర్ తీర్పు ఇచ్చారని ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి  తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి  హెచ్చరించారు.