BREAKING
నూతన వధూవరులను ఆశీర్వదించిన మడకశిర ఎమ్మెల్యే. స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం! ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీలు విరాట్ కోహ్లి భారీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. ఐఎల్‌టీ20 అరంగేట్రంలోనే అదుర్స్! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో భారత రికార్డు! అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌ ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం

కొత్త ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.

Select Suryaa Now
కొత్త ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.


నల్గొండ జిల్లా బ్యూరో, మెజార్ న్యూస్...           వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదు,కొత్త ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి .చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు నోటిఫికేషన్ షెడ్యూల్  ఈనెల 28న విడుదల చేయడం జరిగిందని, దినపత్రికలతో పాటు, జిల్లా కలెక్టర్, ఏ ఈ ఆర్వో కార్యాలయాలలో ప్రచురించినట్లు తెలిపారు. అక్టోబర్ 15 న, తిరిగి  అక్టోబర్ 25  న  మరోసారి దినపత్రికలలో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం -18 లో నవంబర్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాలని,  నవంబర్ 25 న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ముసాయిదా ఓటరు జాబితా పై నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, డిసెంబర్ 25న అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని, డిసెంబర్ 30 న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు .
     వరంగల్- ఖమ్మం -నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నిక 12 జిల్లాల పరిధిలోకి వస్తుందని ,నల్గొండ అడిషనల్ కలెక్టర్ ఈ ఎన్నికలకు ఎలాక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా (ఈ ఆర్ ఓ)  గా వ్యవహరిస్తారని, సబ్ కలెక్టర్లు, ఆర్డిఓ, తహసిల్దార్లు ఏఈఆర్వోలుగా  వ్యవహరిస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం 18 లో నమోదు చేసుకోవాలని ,ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని , అయితే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ఓటర్లను ప్రోత్సహించాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు.   ఈ ఎన్నికలకు మొత్తం నియోజకవర్గం వారిగా 605 పోలింగ్ కేంద్రాలు ఉండగా, నల్గొండ జిల్లాలో 97 ఉన్నాయని, అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 2024 ఎన్నికలలో ఓటు హక్కు ఉన్నవారు కూడా ఇప్పుడు కొత్తగా ఓటరు గా నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదుకు పారం- 18 తో పాటు, తప్పనిసరిగా సొంత ధ్రువీకరణ తో పాటు,గజిటెడ్ అధికారి చే ధ్రువీకరణ సమర్పించాలని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటరు గా నమోదయ్యేందుకు  నిర్దేశించిన తేదీ నవంబర్ 1 ,2026 కు మూడేళ్ల ముందు డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, ఈ నియోజకవర్గ నివాసి అయి ఉండాలని వెల్లడించారు.గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటరు గా నమోదుకు జిల్లాలో ఇప్పటివరకు 3565 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం జరుగుతుందని, అలాగే మున్సిపల్ వాహనాల ద్వారా ప్రచారం కల్పిస్తామని తెలిపారు . ఓటరు  జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ )పై కలెక్టర్ మాట్లాడుతూ డాక్యుమెంట్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతున్నదని, ఇంకా 72,000 డాక్యుమెంట్స్ పరిశీలించాల్సి ఉందని తెలిపారు. బిఎల్ఓ లు అవసరమైన దృవపత్రాలను స్వీకరిస్తున్నారని, పరిశీలన కార్యక్రమాన్ని ఈ వారంలో పూర్తి చేస్తామని , సర్ లో  భాగంగా ఓట్లను తొలగించడం జరుగుతుందన్న అపోహలను నమ్మవద్దని ఆయన తెలిపారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,
టిఆర్ఎస్ పార్టీ  నుండి బక్క పిచ్చయ్య, సిపిఎం పార్టీ నుండి  నర్సిరెడ్డి, టిడిపి పార్టీ నుండి రవి , ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డాక్టర్ అన్సారి, అద్దంకి రవీందర్, ఎంఐఎం పార్టీ  నుండి రఫీయుద్దిన్
తదితరులు హాజరయ్యారు.