కొండాపూర్ దుర్గామాత ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు విగ్రహాల దాతలకు, బంగారు కళ్లను సమర్పించిన దంపతులకు సన్మానం
హఫీజ్ పెట్,మేజర్ న్యూస్ : కొండాపూర్ ఆనంద్‌నగర్ కాలనీలోని శ్రీ దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్ అమ్మవారి విగ్రహాన్ని సమర్పించిన నరేంద్ర జీస్తా, పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని సమర్పించిన కుమారి అస్కానీ అలంకృత సాగర్, అమ్మవారి విగ్రహానికి బంగారు కళ్లను సమర్పించిన రంగారావు–లక్ష్మి దంపతులను దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అమ్మవారి సేవలో విగ్రహాలు, బంగారు కళ్లను సమర్పించిన దాతల భక్తిభావం, దాతృత్వం అభినందనీయమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి దాతల సహకారం ఎంతో విలువైనదని కొనియాడారు.అన్నదాన కార్యక్రమంలో భక్తులు, స్థానిక మహిళలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.