కోహిర్ ప్రభుత్వ పాఠశాలకు సి.ఎస్.ఆర్. నిధులు
కోహిర్ ; కోహిర్ మండల కేంద్రంలోని కొత్తూరు (డి) ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి ఓ ప్రైవేట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాణిక్ ప్రభు, సంస్థ ప్లాంట్ హెడ్ అనూఫ్ సోనకర్, భవన్ నారాయణ కలిసి తరగతి గది నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి సంస్థ ముందుకు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ప్రైవేట్ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దోహదపడతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.