*కోహిర్ మండలంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకల*
కోహిర్;నవంబర్ 14వ తేదీన భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా కోహిర్ మండలంలోని రాజనెల్లి గ్రామ సర్పంచ్ అమృతప్ప శనివారం రోజు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.అనంతరం విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు,కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అమృతప్ప మాట్లాడుతూ ఈరోజు పిల్లలే రేపటి పౌరులు బాలల దినోత్సవం విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో , పంచాయతీ సెక్రెటరీ ఆనందం గ్రామ సర్పంచ్, గ్రామస్తులందరూ విద్యార్థుల తల్లిదండ్రులు, వార్డు మెంబర్లు అంగన్వాడి అంగన్వాడి టీచర్ ఆయలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.