కీసర అభివృద్ధికి రూ.2.90 కోట్ల నిధులు.. సుభాష్‌నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
కీసర, మేజర్ న్యూస్: కీసర డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ నాయకుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో ఇప్పటివరకు రూ.2.90 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా కీసర గ్రామంలోని సుభాష్‌నగర్ కాలనీలో సుమారు రూ.57 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు నాయకులు శంకుస్థాపన చేశారు. రూ.28 లక్షలు, రూ.29 లక్షల అంచనా వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు రాకపోకల సౌకర్యం మెరుగుపడనుంది. కాలనీల్లో రహదారుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయరెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కీసర డివిజన్ ప్రధాన కార్యదర్శి తటకం లక్ష్మణ్ శర్మ, కార్యదర్శి రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొరుగు ముత్యాలు, ఉపమతి శర్మ, జంగయ్య యాదవ్, మాజీ ఎంపీపీ సుజాత, పినింటి కృష్ణారెడ్డి, అన్వర్ పాషా, దొంతోజీ వెంకటేష్ చారి, రెడ్డబోయిన ప్రవీణ్, పోషబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.