BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

కట్ట ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలి!

Select Suryaa Now
కట్ట ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలి!

హుస్నాబాద్  :కట్ట ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి రెండు గంటల స్థలం కేటాయించి పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.కోహెడ మండల కేంద్రంలో ఇటీవల ప్రభుత్వ భూమి పేరుతో నివాస గృహాలను కూల్చివేసిన ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాల ఇళ్లను కూల్చివేయడం వల్ల బాధితులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కట్ట ప్రవీణ్ కుటుంబానికి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.కక్షపూరితంగా వ్యవహరించి కట్ట ప్రవీణ్ ఇంటిని కూల్చివేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రెండు గంటల స్థలం కేటాయించి, పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.పేద కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అధికారులు వారి ఇళ్లను కూల్చివేసి నిరాశ్రయులను చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి నాయకులను పిలిపించుకొని కట్ట ప్రవీణ్ కు జరిగిన అన్యాయం పై విచారం వ్యక్తం చేసి రెండు గంటల స్థలం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టుగా బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఖమ్మం వెంకటేశం పైడిపల్లి పృథ్వీరాజ్  బిజెపి అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి హుస్నాబాద్ మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ కర్ణ కంటి నరేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు