BREAKING
మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బిగ్ షాక్.... బిఆర్ఎస్ లో చేరిన నాయకులు

Select Suryaa Now
కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బిగ్ షాక్.... బిఆర్ఎస్ లో చేరిన నాయకులు


సూర్య- బిక్కనూర్ :కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులకు మండలంలో బిగ్ షాక్ తగిలింది. మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి బుధవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు సామ నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుమ్మరి ఎల్లం తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో
బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జ్ మండల అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్, డ్రామా పార్టీ అధ్యక్షుడు సాయిలు, గ్రామ సర్పంచ్ భాగ్య నీలం రెడ్డి, ఉప సర్పంచ్ సాయన్న, పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, మహిపాల్ రెడ్డి, రత్నం రెడ్డి, సంజీవరెడ్డి, ఎస్.కె మహిపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు